Rohit Sharma, David Warner Are The World’s Best T20 Openers Says Tom Moody | Oneindia Telugu

2020-04-05 378

Former Australian cricketer and Sunrisers Hyderabad head coach Tom Moody has picked David Warner and Rohit Sharma as two best openers in T20 cricket.
#RohitSharma
#DavidWarner
#TomMoody
#WorldsBestT20Openers
#mumbaiindians
#ipl2020
#viratkohli
#cricket
#teamindia

టీ20 క్రికెట్‌లో రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అత్యుత్తమ ఓపెనర్లు అని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, సన్​రైజర్స్ హైదరాబాద్ కోచ్ టామ్ మూడీ అభిప్రాయపడ్డాడు. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆటలు అన్ని రద్దయ్యాయి. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్-13 సీజన్ కరోనా కారణంగా ఏప్రిల్ 15కి వాయిదా పడింది. వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో ఐపీఎల్ జరగడం అనుమానంగానే ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కానీ.. దాదాపు లీగ్ జరగడం అసాధ్యమే.
కరోనా కారణంగా ఆటలన్నీ బంద్ కావడంతో క్రీడాకారులు, మాజీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులను పలకరిస్తూ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ జాబితాలో టామ్ మూడీ కూడా చేరాడు. ట్విట్టర్​లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో టీ20 ఫార్మాట్‌లో అత్యుత్తమ ఓపెనర్స్ ఎవరు? అని ఒక అభిమాని ప్రశ్నించగా.. రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ అని మూడీ వెంటనే సమాధానమిచ్చాడు. అలాగే భారత యువ ఆటగాడు శుభమన్ గిల్​ను కూడా ఎంపిక చేసుకున్నాడు.